Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసెంబ్లీలోపయ్యావుల కేశవ్ పద్దు వచ్చే నెల 14న
posted on: Jan 28, 2026 1:57PM
.webp)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 12 వరకూ నిర్వహించనున్నారు. ఇక 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. కాగా సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజున అంటే ఫిబ్రవరి 11న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అదే రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈసారి సమావేశాలు కేవలం బడ్జెట్‌కే పరిమితం కాకుండా పలు కీలక బిల్లులను ఆమోదించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందు కోసం ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులకు సమాచారం అందించింది.


.webp)



