మెట్రోకి 300 కోట్లు... ఇంకా...
Published on: Thu Mar 12, 2015 2:06PM

విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు 2015-16 వార్షిక ఆర్థిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయించింది. గోదావరి పుష్కరాలకు 200 కోట్ల రూపాయలు కేటాయించింది. రైతు రుణమాఫీ రెండో దశ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కంటే ముందే పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.


