దేశంలోనే తొలి కంప్యూటరైజ్డ్‌ అసెంబ్లీ

 

AP Assembly to be computerized, Assembly Computerized

 

 

ఇక మీదట రాష్ట్ర అసెంబ్లీలో కాగితాలు కనిపించవు.. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర అసెంబ్లీని పూర్తి స్థాయిలో కంప్యూటరీకరించనున్నారు.. దాదాపు అసెంబ్లీ ఇచ్చే అన్ని ఆదేశాలు సందేశాలను ఇకపై ఎలక్ట్రానిక్‌ పద్దతిలోనే పంపనున్నారు.. అందుకు ఈ మెయిల్స్‌ సందేశాలను వినియోగించుకోనున్నారు..

 

అసెంబ్లీ కంప్యూటరీకరణకు కేంద్రం ఆర్ధిక సాయం ప్రకటించదన్నారు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌..ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన స్పీకర్‌ మనోహర్‌ మీడియాతో మాట్లాడారు.. కేంద్రం 16.15 కోట్ల రూపాయలను అసెంబ్లీ ఆధునీకరణకు కేటాయించిందని చెప్పారు..


ఇకపై కౌన్సిల్, అసెంబ్లీకి సంబంధించిన కార్యక్రమ వివరాలను ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తామన్నారు.ఈ ఆధునికరణకు సంవత్సరంనర కాలం పడుతుందని, దీనిపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అసెంబ్లీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు అసెంబ్లీ వెబ్‌సైట్‌ను కూడా తెలుగులో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు..