లీకేజీల వ్యవహారంపై దద్దరిల్లిన అసెంబ్లీ...

 

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా ఎప్పటిలాగానే అధికారపక్ష, విపక్ష నేతల ఆందోళన దద్దరిల్లింది. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీల వ్యవహారంపై అసెంబ్లీ అట్టుడికిపోతుంది. ఈరోజు కూడా ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు.  స్పీకర్ పోడియం వద్దకు చేరి లీకేజిల ప్రభుత్వం డౌన్ డౌన్ నినాదాలు చేపట్టారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందువల్ల దానిపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.