వైఎస్సార్ ఫోటో తొలగింపు.. అసెంబ్లీలో ఆందోళన
posted on Sep 2, 2015 11:47AM
.jpg)
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ అలా మొదలైందో లేదో ఇలా వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఆసెంబ్లీ ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటం తొలగించినందుకు వైసీపీ నేతలు రాజశేఖర్ రెడ్డి ప్లకార్డులు పట్టుకొని వైయస్ జోహార్ అంటూ నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టి నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆందోళనలు ఆపాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఈ ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా కరవు, రైతు ఆత్మహత్యలు, తాగునీటి సమస్యపై వైకాపా ఇచ్చిన వాయిదాతీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించారు. దీంతో వైకాపా నేతలు మరోసారి ఆందోళనలు చేయగా కరవు పరిస్థితులపై రేపు చర్చిస్తామని ప్రభుత్వం చెప్పిందని స్పీకర్ కోడెల తెలిపారు.