ఈరోజు కూడా అదే వైఖరి



నాల్గవరోజు  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత మూడు రోజులుగా ఏపీ శాసనసభా సమావేశాల్లో ఏం జరుగుతుందో ఈరోజు కూడా అదే వైఖరి కనబడుతోంది. సభ ప్రారంభంకాగానే వైసీపీ నేతలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు కి వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే స్పీకర్ వారిచ్చిన తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వైసీపీ నేతలు వెంటనే తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ  ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనలు చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని.. ప్లకార్డులు సభలోకి తీసుకురావద్దని స్పీకర్ వారిని కోరినా ఉపయోగంలేకుండాపోయింది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాగా ఈరోజు సమావేశంలో మరిన్నికీలక బిల్లులు చర్చకు రానున్నాయి. దీంతో సమావేశాలు మరింత వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu