మార్చి 7 వరకూ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

posted on: Feb 11, 2026 12:00PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 7 వరకూ జరగనున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బుధవారం (ఫిబ్రవరి 11) జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు బడ్జెట్ సమావేశాలు మొత్తం 17 దినాలు కొనసాగనున్నాయి.

అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించేందుకు కూడా బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నెల 14న సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 17, 18 తేదీలలో సభలో బడ్జెట్ పై చర్చిస్తారు.  18వ తేదీన సభలో జరిగిన చర్చకు విత్త మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిస్తారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...