TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా

Published on: Fri Nov 22, 2024 2:43PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు సాగాయి. విపక్ష వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ తో సమావేశాలను బహిష్కరించింది. ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైనంత మంది సభ్యుల బలం లేకపోయినా,  ఆ డిమాండ్ చేయడం ద్వారా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేయాలని ముందే నిర్ణయించుకుని  తాను అసెంబ్లీకి డుమ్మా కొట్టడమే కాకుండా మిగిలిన పది మంది పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా నిరోధించారు.

అయితే వైసీసీ సభలో లేకపోయినా తెలుగుదేశం కూటమి సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషించి సభలో అర్థవంతమైన చర్చలు జరిగిలా చూశారు. ప్రజాసమస్యలను ప్రస్తావించి మంత్రుల నుంచి వాటి పరిష్కారానికి హామీ పొందారు. ఈ సారి సమావేశాలు మొత్తం 59 గంటల 57 నిముషాల పాటు సాగాయి. సభ్యులు అడిగిన 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పరు. అలాగే 27 బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. వీటిలో అత్యంత కీలకమైన భూకబ్జాల నిరోధక బిల్లు, ఏపీ కో-ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఇండియా మేడ్‌ లిక్కర్, ఫారిన్ మేడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లు-2024లు  ఉన్నాయి.