TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ అసెంబ్లీ.. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ సస్పెండ్

Published on: Fri Dec 18, 2015 10:10AM

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ నేతలు కాల్ మనీ వ్యవహారం పై చర్చించాలని పట్టుబట్టారు. అయితే డా. అంబేద్కర్ గురించి మాట్లాడిన తరువాత కాల్ మనీ వ్యవహారం గురించి చర్చిద్దామని స్పీకర్ చెప్పినా వైసీపీ నేతలు మాత్రం వినక సభలో ఆందోళనలు చేస్తున్నారు. దీంతో జగన్, ఉపనేత జ్యోతుల నెహ్రూ సహా మిగిలిన ఎమ్మెల్యేలు అందరినీ సస్పెండ్ చేశారు స్పీకర్ కోడెల. అంబేద్కర్ పై చర్చ ముగిసే వరకూ సస్పెన్షన్ వుంటుందని స్ఫష్టం చేశారు.