అసెంబ్లీకి రమ్మని బొట్టు పెట్టి పిలవరు... లోకేష్ చురకలు

posted on: Feb 23, 2026 6:21PM

 

అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవరని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు. వైసీపీ నేతలు దేవుణ్నే రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమన్నారు. తిరుమలో కొలువుదీరిన దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగా బయటపెడతామని  లోకేశ్ వెల్లడించారు. శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నీ మంగళవారం (24-2-26న)అసెంబ్లీలో పెడతామని తెలిపారు. 

సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం అభ్యంతరకరమని లోకేశ్ వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...