రోజా సస్పెన్షన్ పై జగన్ పట్టు.. సస్పెన్షన్ ఎత్తేసేది లేదు.. యనమల

అసెంబ్లీలో రోజా సస్పెన్షన్ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఒకవైపు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పట్టుబట్టి.. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే సభలో ఉండమని.. ఈ సమావేశాలకు బాయ్ కట్ చెబుతామని అంటుంటే.. మరోవైపు తెలుగు దేశం పార్టీ నేత యనమల మాత్రం రోజాపై సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదని.. సస్పెన్షన్ పై కోర్టుకు వెళ్లినా మాకు అభ్యంతరం లేదని.. రోజా సస్పెన్షన్ పై ఏడాది నుండి తగ్గించేది లేదని తేల్చిచెబుతున్నారు.

ఇదిలా ఉండగా వైఎస్ఆర్సీ ఎల్పీలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేపు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu