ఏపీ అసెంబ్లీ.. జగన్ ప్రతిపక్షనేతగా దురదృష్టకరం..

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో కాల్ మనీపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. దీంతో సభ కాస్త ఇరు పార్టీ నేతల ఆందోళనలతో రచ్చ రచ్చగా మారిపోయింది. ఒకరి పై ఒకరు విమర్శల దాడికి దిగారు. 11 ఛార్జి షీట్లు ఉన్న జగన్ ప్రతిపక్షనేతగా ఉండటం దురదృష్టకరం.. జగన్ కు చరిత్ర, చట్టాలు, రాజ్యాంగం గురించి తెలియదు అని మంత్రి యనమల జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. దానికి జగన్ అధికార పార్టీ రాజకీయాలకోసం అంబేద్కర్ ను అడ్డుపెట్టుకోవాలని చూస్తుంది.. అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది అని విమర్శించారు. ఇక వైసీపీ నేతల ఆందోళనకు స్పీకర్ కూడా స్పందించి.. వైసీపీ ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోవాలని.. కెమెరాలకు అడ్డంగా వెళ్లడం.. ప్లకార్డులు పట్టుకొని ఆందోళనలు చేయడం సరికాదని హెచ్చరించారు. అయినా వైసీపీ నేతలు వినకపోవడంతో  ఇప్పటికే సభను 15 నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్ కోడెల మళ్లీ 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.