వరంగల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లకపోవచ్చును

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చునని తెలుస్తోంది. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఇప్పుడిపుడే మళ్ళీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సయోధ్య ఏర్పడుతోంది. ఆ కారణంగా రెండు ప్రభుత్వాల మధ్యన ఘర్షణ తగ్గి కొంత సామరస్య వాతావరణం కనిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికలలో ప్రచారం చేయాలంటే తప్పనిసరిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించవలసి వస్తుంది. ఆ కారణంగా పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది కనుకనే చంద్రబాబు నాయుడు ఈ ఉప ఎన్నికలు ఎన్నికలలో ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఆయన మొదటి నుంచి కూడా “తెలంగాణాలో తెదేపా-తెరాసలు వాటి పని అవి చేసుకుపోనిద్దాము. ప్రభుత్వాలు ఒకదానికొకటి సహకరించుకొందాము,” ని చెప్పుతున్నారు. ఆ ప్రతిపాదన వినడానికి బాగానే ఉన్నా తెదేపా చేసే పోరాటాలతో ఇబ్బందిపడేది తెరాస ప్రభుత్వమే కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు తెరాస ప్రభుత్వంతో దాని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సయోధ్యగా కొనసాగాలనే భావిస్తుండటంతో వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చునని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu