Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీడీపీకి మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా!
posted on: Jul 10, 2019 4:45PM

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో ఎమ్మెల్సీ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా సతీష్ చేయనున్నారు. గుంటూరు జిల్లా టీడీపీలో ఆయన కీలక నేతగా ఉన్నారు. ముఖ్యంగా బాపట్ల టీడీపీలో అన్నం సతీష్ తిరుగులేని నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు. అయితే సతీష్ కృషిని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మండలికి పంపారు. అయితే ఇప్పుడు అన్నం సతీష్ రాజీనామా వార్త ప్రస్తుతం గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారన్న అంశంలో ఇంకా స్పష్టత రాలేదు. కొందరు వైసీపీలో చేరే అవకాశముంది అంటుండగా, కొందరు మాత్రం ఆయన సుజనా చౌదరి సన్నిహితుడని దీంతో ఆయన బీజేపీలో చేరే అవకాశమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు.


.jpg)



