TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త్వరలో ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు : మంత్రి కొల్లు రవీంద్ర

Published on: Mon Jul 28, 2025 5:15PM

 

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ కింద మూడు విడతల్లో రైతులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.  శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ  కార్యాలయంలో శాసన సభ్యురాలు గౌతు శిరీషతో కలిసి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. 

ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గతంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన చాలా సంస్థలు తిరిగి వస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని.. కులమతాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు.