'హజారే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్'

posted on: Oct 26, 2011 11:32AM

న్యూఢిల్లీ: తమ బృందంపై బురదచల్లే ప్రచారం వెనుక పాలక పక్షంలోని దుష్టచతుష్టయం  హస్తముందంటూ ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే చేసిన ఆరోపణను కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై కేంద్ర న్యాయ శాఖామంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఒక ప్రకటన విడుదల చేశారు. పౌరసమాజంతో ఎలాంటి తగాదాలను ప్రోత్సహించేది లేదన్నారు.హజారేను తాము ఎంతో గౌరవిస్తామని, ఆయన నోట దుష్టచతుష్టయం వంటి పదజాలం వెలువడటం దురదృష్టకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఆ దుష్టచతుష్టయం పేర్లను తెలుసుకోవాలన్న ఆత్రుత తనకు ఎంతగానో ఉందని, ఆ గ్యాంగ్‌లో ఉన్న నలుగురి పేర్లను హజారే వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...