Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాపై విమర్శలకు ఆ నలుగురే కారణం: అన్నా
posted on: Oct 25, 2011 3:07PM
న్
యూ ఢిల్లీ: తమ బృందం సభ్యులపై వస్తున్న వివిధ రకాల విమర్శలకు ఆ నలుగురు సభ్యుల గ్యాంగ్ ప్రధానకారణమని ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు. ఎవరైతే జన్‌లోక్పాల్ బిల్లును వ్యతిరేకిస్తున్నారో వారే తమ బృందంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు కారణమన్నారు. ఈ ఫోర్ మెంబర్ గ్యాంగ్ కారణంగానే తమపై అవినీతి ఆరోణలు వస్తున్నాయని హజారే పేర్కొన్నారు.అన్నా బృందం సభ్యులైన అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో అన్నా హజారే వారికి మద్దతు తెలిపే విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రామ్‌లీలా మైదానంలో సాగిన దీక్షాసమయంలో అరవింద్ కేజ్రివాల్ కార్యకర్తల నుంచి చందాలు వసూలు చేశారని ఇదే బృందానికి చెందిన స్వామి అగ్నివేష్ అరోపించారు.
ఇక కిరణ్ బేడీ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధరకు బిల్లుకు క్లెయిమ్ చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిపై అన్నా బృందం వ్యతిరేక సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.


.jpeg)



