TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేడు జై జగన్ అన్నందుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి

Published on: Sat Jun 14, 2025 8:38PM

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ, అడవి శాఖ సలహాదారుడుగా కొమిర జాజి  (అంకారావు) అనే వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. జై జగన్ అన్న లేదని తోట చంద్రయ్య ను వైసిపి నేతలు గొంతు కోసిన విషయం అందరికి తెలిసిందే.. ఇటీవల కొమర జాజి  జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేసి.. జై జగన్ అన్నందుకు కూటమి ప్రభుత్వం కీలక పదవి కట్ట పెట్టడంలో.. కూటమి శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్  వైసిపి  బీసీ సెల్ అధ్యక్షుడుగా  2018లో నియమితులయ్యారు. 

అప్పటిలో అంబటి రాంబాబు నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న అంబటి రాంబాబు చేతుల మీదగా వినతి పత్రాన్ని పొందారు. ఇప్పటికి కూడా వైసిపి పార్టీకి కొమెర జాజి అనే వ్యక్తి  ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ కి రాజీనామా చేయలేదంటూ కూటమి శ్రేణులు బహిరంగనే చెప్పుకుంటున్నారు. వైసీపీకి చెందిన వ్యక్తికి కూటమి ప్రభుత్వం కీలక పదవి ఇవ్వడంతో కూటమి శ్రేణులు  సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూటమి శ్రేణులు మండిపడుతున్నారు.

కూటమి శ్రేణులు తెలిసి తెలియక చిన్న తప్పులు చేస్తేనే.. పార్టీ నుండి సస్పెండ్ చేసే అధినేతలు.. ఇలాంటి విషయాల్లో.. నియోజకవర్గ నాయకుల ప్రమేయం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పార్టీ శ్రేణులు పూర్తిగా ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పర్యావరణ శాఖ సలహాదారుడు జై జగన్ అంటున్న వీడియో టిడిపి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. కూటమి శ్రేణులు ఎదురుచూస్తున్నారు.