Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జాతీయ రక్షణ నిథికి ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విరాళం.. ఎంతో తెలుసా?
posted on: May 10, 2025 3:47PM
.webp)
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ రక్ణణ నిథికి విరాళంగా తన నెల వేతనాన్ని అందజేశారు. ఆన్ లైన్ పేమెంట్ విధానం ద్వారా ఆయన ఈ విరాళాన్ని జాతీయ రక్షణ నిథికి సమర్పించారు. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు తెలియజేసిన ఆయన ఉగ్రవాద నిర్మూళన కోసం సాయుధ దళాలు అత్యంత సాహసోపేతంగా చేస్తున్న పోరాటం పట్ల ప్రతి భారతీయుడూ గర్వంతో పొంగిపోతున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావంగా తన వంతుగా నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్ల చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే జాతీయ రక్షణ నిథికి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రక్షణ నిథికి విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రజా ప్రతినిథులకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఒక రోజు వేతనాన్ని జాతీయ రక్షణ నిథికి విరాళంగా ప్రకటించారు.






