TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీకి హోదాపై మళ్లీ వెంకయ్య మాట మారింది

Published on: Sat Oct 3, 2015 12:36PM

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి యూటర్న్ తీసుకున్నారు, ఏపీకి స్పెషల్ స్టేటస్ కన్నా ప్రాజెక్టులు రావడమే ముఖ్యమన్న వెంకయ్య... అదే తన తొలి ప్రాధానత్య అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినా కొత్త ప్రాజెక్టులు రావడం రాక ఇబ్బందులు పడుతున్నాయని, అందువల్ల ఏపీకి హోదా కన్నా... కొత్త ప్రాజెక్టులు తీసుకురావడమే ముఖ్యమన్నారు, తన తొలి ప్రాధాన్యత ప్రాజెక్టులు తీసుకురావడమే అయినా, ప్రత్యేక హోదా కోసం కూడా పోరాడతామంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా ఏపీకి పదేళ్లు హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన వెంకయ్య... అధికారంలో వచ్చాక ఇలా అనేకసార్లు మాట మార్చడంపై అటు విపక్షాలు, ఇటు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు