TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గవర్నర్‌తో ఏపీ మంత్రులు ఏం మాట్లాడారు?

Published on: Tue Nov 18, 2014 6:03PM

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు మంగళవారం నాడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి పరీక్షల నిర్వహణ అంశాన్ని మంత్రులు గవర్నర్‌కి నివేదించారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, తమ నివేదనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, బుధవారం సాయంత్రం రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో భేటీ అవుతానని ఆయన చెప్పారని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని ఎలాంటి భేషజాలు పోకుండా తెలంగాణ ప్రభుత్వంతో చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా వుందనం మంత్రి గంటా ఈ సందర్భంగా చెప్పారు. ఇదిలా వుండగా రెండు రాష్ట్రాల విద్యామంత్రులతో గవర్నర్ సమావేశం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.