ఏపీ మెట్రో సలహాదారుగా శ్రీధరన్
Published on: Mon Sep 1, 2014 12:41PM

భారత మెట్రో రైలు వ్యవస్థ ప్రముఖుడు, అందరూ ‘మెట్రోమాన్’గా పిలిచే శ్రీధరన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో రైలు పనులను పర్యవేక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా శ్రీధరన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదలకానుంది. తిరుపతిలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని శ్రీధరన్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టు సమాచారం.


