Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా?
posted on: Apr 19, 2025 11:09PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. చాలా కాలంగా మెగా డీఎస్సీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీని ప్రకటించేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శనివారం (ఏప్రిల్ 19) సాయంత్రం విడుదల చేసిన ప్రకటన మేరకు మెగా డిఎస్సీ 2025 నోటిఫికేషన్ఆదివారం (ఏప్రిల్ 20)న వెలువడ నుంది.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన తొలి సంతకం మెగా డీఎస్పీ ఫైలు పైనే చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన రోజు వ్యవధిలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో కలిపి 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తి చేసేందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఆదివారం (ఏప్రిల్ 19) విడుదల చేయనుంది.ఇప్పటికే మెగా డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ వయోపరిమితి పెంపు ఈ మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని జీవోలో స్పష్టంగా పేర్కొంది. కాగా మొత్తం 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేపు అంటే ఆదివారం (ఏప్రిల్ 20)న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కూడా పేర్కొంది.






