TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల

Published on: Thu Apr 23, 2015 5:19PM

 

ఆంధ్రప్రదేశ్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ఫలితాలను విడుదల చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో మొదటిసారి విడుదల చేసిన పరీక్ష ఫలితాలివి. జనరల్‌లో 52 శాతం మందికి ‘ఎ’ గ్రేడ్ వచ్చింది. ఒకేషనల్‌లో 60 శాతం మందికి ‘ఎ’ గ్రేడ్ వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,61,932 మంది విద్యార్థులు జనరల్ కేటగిరీలో హాజరవగా, 26,913 మంది ఒకేషనల్‌కి హాజరయ్యారు.