ఏపీలో ఒక రోజు ముందే పెన్షన్లు

posted on: Feb 25, 2026 1:14PM

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక భద్రతా పెన్షన్లు ఈ నెల ఒక రోజు ముందుగానే పంపిణీ కానున్నాయి. నెలనెలా ఠంచనుగా మొదటి తేదీన సమాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ సారి మాత్రం ఒక రోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 28నే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వలు జారీ చేసింది.

మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే శనివారం (ఫిబ్రవరి 28) పంపిణీ చేయనుంది.  పెన్షన్ పంపిణీలో ఎలాంటి అంతరాయం రాకుండా ఫిబ్రవరి 28న చెల్లింపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే  గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు  అధికారిక ఉత్తర్వులు అందాయి. పెన్షన్ పొందే వారు నిర్ణీత తేదీన తమకు రావలసిన మొత్తం సకాలంలో అందుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని   స్పష్టమైన ఆదేశాలతో ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి గందరగోళానికీ తావివ్వకుండా పంపిణీ చేయాలని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...