Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కరెంట్ షాక్.. ఐదుగురి మృతి
posted on: Nov 28, 2014 2:58PM

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. కరెంట్ తీగలు తెగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అనంతపురం జిల్లా విడపనకల్ మండలం చీగలగుర్కి గ్రామంలో పొలంలో వున్న బోరుకు మరమ్మత్తు చేస్తుండగా హైటెన్షన్ తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన రేవన్న, ఎర్రిస్వామి, బ్రహ్మయ్య, వీరేంద్ర, రాజశేఖర్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన గురించి తెలిసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటన మీద జపాన్ నుంచే విచారణకు ఆదేశించారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణం సంఘటన స్థలానికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.






