తణుకులో చేపల వాన
Published on: Sun Jun 5, 2016 5:51PM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వర్షంతో పాటు చేపలు కూడా కురిశాయి. పట్టణంలోని జాతీయ రహదారి వెంబడి వర్షంతో పాటు చేపలు కూడా పడ్డాయి. ఈ వింతను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదన్నారు. అనంతరం వాటిని పట్టుకునేందుకు పోటీ పడ్డారు.



