ఏపీలో 13 టూరిస్ట్ ప్రదేశాలు

 

ఏపీ రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటినుండే కసరత్తు చేసే పనిలో పడింది. రాజధాని అమరావతిని ఎలా నిర్మించాలి.. ఏంఏం ప్రత్యేకంగా నిర్మించాలి అనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పుటికే రాజధానిలో 45, 50 అంతస్తులు కలిగిన ట్విన్ టవర్స్ నిర్మించాలని... అంతేకాక ఓ 10 అతి పెద్ద బిల్డింగులు కట్టాలని ఆదిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు. దీనితో పాటు అమరావతి ఓ పెద్ద టూరిస్ట్ ప్రదేశంగా మార్చే యోచనలో ఉన్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు ముఖ్యమైన అధికారులు స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ఏ.కే. పరిడా, సతీష్ చంద్ర, నీరబ్ కుమార్ ప్రసాద్, సాయి ప్రసాద్, అనురాధ పాల్గొన్నారు.

 

అయితే ఈ సమావేశం అనంతరం అధికారులు మాట్లాడుతూ ఏపీ రాజదానిలోని 13 ప్రాంతాలను టూరిస్ట్ ప్రదేశాలుగా మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్టు చెప్పారు. అంతేకాదు ప్రపంచ దేశాల నుండి బౌద్దులు బీహార్లోని బుద్దగయకు వస్తుంటారు.. అలాంటి తరహాలోనే అమరావతిలోని విశాలమైన ఆశ్రమాన్నినిర్మించాలని ఏపీ ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు తెలిపారు. కాకినాడలోని కోనసీమను కూడా మంచి ఐలాండ్ తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. అంతేకాక టూరింగా స్పాట్లో అక్కడక్కడ వాహనాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే చంద్రబాబు నెలరోజుల్లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని.. హైదరాబాద్ లో ఉన్న శాఖలలోని కొన్ని శాఖలను ఇక్కడకు మార్చాలని భావిస్తున్నారు. అంతేకాక 2018 కల్లా మొదటి దశ రాజధానిని పూర్తి చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఓ అద్భుతమైన రాజధానిని చంద్రబాబు ఏపీకి అందిస్తారని అనిపిస్తుంది.