Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పట్టాభి రామ్, రావి కొండలరావులకు కళారత్న అవార్డు
posted on: Mar 20, 2015 7:48AM
సాహిత్య, కళా రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీఏటా తెలుగువారి నూతన సంవత్సరమయిన ఉగాది పండుగరోజున అవార్డులు, నగదు పారితోషికంతో సత్కరిస్తుంటుంది. ఈసారి కూడా రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 32 మందికి కళారత్న అవార్డులు, 67 మందికి ఉగాది పురస్కారాలను ప్రకటించింది.
మన్మధనామ సంవత్సరమయిన కొత్త సంవత్సరంలో తెలుగువెలుగు విశిష్ట పురస్కారానికి ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావుని ఎంపిక చేసింది. ఆయనకు లక్ష రూపాయలు బహుమానంగా అందజేస్తారు.
కళారత్న అవార్డుకు ఎంపికయిన వారికి ఒక్కక్కరికీ రూ.50 వేలు, ఉగాది పురస్కారాలకి ఎంపికయిన వారికి ఒక్కొకరికీ రూ.10 వేలు చొప్పున నగదు బహుమతిని ప్రభుత్వం అందజేస్తుంది.
కళారత్న (హంస) అవార్డుకు ఎంపికయిన ప్రముఖులు:
సాహిత్యం: యద్దనపూడి సులోచనా రాణి, అక్కిరాజు రమాపతి రావు, కొలకలూరి స్వరూపా రాణి, జీడిగుంట రామచంద్ర మూర్తి, దేవీప్రియ.
నాటక రంగం: రావి కొండలరావు, ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ, కందిమళ్ళ సాంభశివరావు, మద్దాల రామారావు, వి.సరోజిని.
జానపదం: ఆచార్య రాజ కుమార్ అడయార్, కొండపల్లి వీరభద్రయ్య, కర్నాటి లక్ష్మి నరసయ్య, శెట్టి గాసమ్మ
సంగీతం: ఫై.వి.యాన్. శేషయ్య శాస్త్రి, ద్వారం మంగ తాయారు.
నాట్యం: వెంపటి రవిశంకర్, లంకా అన్నపూర్ణ, ప్రభా రమేష్
చిత్రలేఖనం: వేముల కామేశ్వర రావు, రావూరి సుబాష్ బాబు, జి. బాలకృష్ణ
శిల్పం: డా. పి. సుబ్రమణి స్థపతి, రేగుల్ల మల్లికార్జున రావు
అవధానం: మేడసాని మోహన్, డా. ధారా రామనాధ శాస్త్రి.
హరి కధ: కోట సచ్చిదానంద శాస్త్రి
ఇంద్రజాలం: డా. పట్టాభి రామ్
మిమిక్రీ: చిత్తూరి గోపీ చంద్
వ్యాఖ్యానం: యమ.కె.ఆర్. ఆశాలత
గ్రందాలయ సేవ: లంకా సూర్యనారాయణ
సమాజసేవ: అన్నే ఫెరర్


.jpg)
.jpg)


