ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు

 

ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతిలో చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల సదస్సు జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి    సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. 

ఈ నేపథ్యంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పై ప్రత్యేక చర్చ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వం సిద్ధమవుతోందట. బనక చర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ ఉండనుందని చెబుతున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu