TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీలోకి ఆనం...రంగంలోకి భూమన..

Published on: Mon Apr 24, 2017 11:35AM


వైసీపీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీ లోకి జంప్ అవుతున్న వేళ.. ఇప్పుడు టీడీపీ నుండి  మరో కీలక నేత వైసీపీలోకి జంప్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఫైర్ బ్రాండ్ ఆనం వివేకానందరెడ్డి, వైకాపాలో చేరనున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. నెల్లూరులో మరింత బలపడేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ పై అసంతృప్తితో ఉన్న ఆనం వివేకాను వైసీపీలోకి రప్పించడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. దీనిలో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగి స్వయంగా ఫోన్ చేసి ఆనం వివేకాతో మాట్లాడినట్టు తెలుస్తోంది.

 

కాగా ఇక టీడీపీలో చేరి 15 నెలలైనా, ఇంతవరకూ ఎటువంటి పదవులు దక్కకపోవడం, తెలుగుదేశం నేతలతో పడక, ఇమడలేక పోతున్నట్టు ఇప్పటికే పలుమార్లు చెప్పిన ఆయన, త్వరలోనే వైకాపా కండువా కప్పుకోవచ్చని భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.