Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తప్పతాగిన డైరెక్టర్... పట్టుకున్న పోలీసులు
posted on: Mar 14, 2015 10:40AM

ఈ మధ్య సినిమా హీరోలు, డైరెక్టర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లోపట్టుబడటం కామన్ అయిపోయింది. ఈసారి ఆ ఛాన్స్ ఎవరు కొట్టేశారంటారా. నృత్య కళాకారుడు, సినీ దర్శకుడు అమ్మ రాజశేఖర్ తప్పతాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పీకలదాకా తాగిన తర్వాత కారు డ్రైవ్ చేసుకుంటూ మాదాపూర్ నుండి బంజారాహిల్స్ వెళ్తున్న ఆయనను జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది. దాంతో అమ్మ రాజశేఖర్ మీద పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే అమ్మ రాజశేఖర్ వాహనం నడుపుతున్నప్పుడు ఆయన కుంటుంబ సభ్యులు కూడా వాహనంలో ఉండటం గమనార్హం.






