సూర్యపేట సభకు  అమిత్ షా 

posted on: Oct 27, 2023 12:47PM

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. శుక్రవారం సూర్యాపేట బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం  ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.  నిన్న రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన బస చేస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి గం.11 వరకు 75వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో పాల్గొన్నారు.

మధ్యాహ్నం గం.3కు సూర్యాపేటకు బయలుదేరుతారు. సాయంత్రం గం.4 నుంచి గం.5 వరకు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం గం.5.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...