Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి కేంద్ర హోంమంత్రి..శోభాయాత్రలో పాల్గొననున్న అమిత్ షా
posted on: Sep 2, 2025 4:25PM

హైదరాబాద్ లో ఏటా గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర కన్నులపండువగా ఉంటుంది. అంగరంగ వైభవంగా సాగే ఈశోభాయాత్రకు బీజేపీకి చెందిన ప్రముఖ నాయకులు హాజరౌతుంటారు.
అలాగే ఈ సారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా సాగే శోభా యాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్మానం మేరకు ఆయన శోభాయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 6న భాగ్యనగర్ గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 6న హైదరాబాద్ వస్తున్నారు. అదే రోజు ఐ టి సి కాకతీయలో బిజెపి ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట మయంలో చార్మినార్ వద్ద వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం ఎంజే మార్కెట్ వద్ద శోభాయాత్రలో పాల్గొంటారు. ఈ రోండు చోట్లా అమిత్ షా ప్రసంగిస్తారు.






