TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు

Published on: Mon Jun 9, 2025 7:10PM

 

జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. దీంతో పాటు పసుపుబోర్డు లోగో ఆవిష్కరణలో కూడా అమిత్‌షా పాల్గొంటారని సమాచారం. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తెలంగా ణ ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రాతిపదికన పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి వాస్తు దోషం కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఉపయోగించడం లేదు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఈ కార్యాలయం వృథాగానే పడి ఉంది. పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరగా.. అంగీకరించారు.