పుచ్చకాయని కోయడమే నేరమైపోయింది.. ఏవిటో..

 

అమెరికాలో చాలా వెరైటీ సంఘటనలు జరుగుతూ వుంటాయి. అలాంటి వాటిని చూస్తే మనలాంటోళ్ళకి బుర్ర తిరిగిపోతూ వుంటుంది. అలాంటి సంఘటనలకు ఒక శాంపిల్ ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని థామస్టన్‌కి చెందిన సెర్విల్లీనో అనే వ్యక్తికి పెళ్ళాంతో ఎప్పుడూ పడదు. దాంతో వీళ్ళిద్దరూ విడిపోదామని నిర్ణయించుకున్నారు. వారం పదిరోజుల్లో ఈ జంట విడాకుల ముచ్చట కూడా తీరిపోయేది. అయితే ఇంతలోనే అతనో పెద్ద నేరం చేశారు. ఆ నేరానికి పోలీసులు అరెస్టు చేశారు. చివరికి కోర్టులో బెయిల్ తీసుకుని బయటపడాల్సి వచ్చింది. ఇంతకీ సెర్విల్లీనో చేసిన నేరం ఏమిటంటే, తన భార్యమీద వచ్చిన కోపాన్ని భార్యమీద చూపించే సీన్ లేక ఆ కోపాన్ని అక్కడే వున్న ఓ పుచ్చకాయ మీద చూపించడం. భార్యమీద కోపమొచ్చిన అతగాడు అక్కడే వున్న ఓ పుచ్చకాయని కత్తితో కసితీరా కోశాడట. దాంతో ఆయన భార్యగారు భయపడిపోయి పోలీసులను ఆశ్రయించింది. తనను కూడా ఇలా కసిగా కోసి చంపేస్తాడేమోనని భయపడిపోయింది. దాంతో పోలీసులు సెర్విల్లీనోని అరెస్టు చేశారు. భార్యముందు పుచ్చకాయని కసిగా కోయడం కూడా గృహ హింస చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu