అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

posted on: Apr 17, 2015 9:32AM

 

అమెరికాలో చదువుకుంటున్న ఓ తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీనగర్ కాలనీకి చెందిన శైలేష్ హర్ష (23) టెక్సాస్‌లో‌ని లామార్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతున్నాడు. గురువారం నాడు బెమౌంట్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్ష దుర్మరణం పాలయ్యారు. హర్షతోపాటు ప్రయాణిస్తున్న ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన దీపక్ గాయపడ్డాడు. వీరిద్దరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...