అమెరికాలో కాల్పులు... 14 మంది మృతి
posted on Dec 3, 2015 6:55AM

అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌బెర్నార్డినో ప్రాంతంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శాన్‌బెర్నార్డినో వికలాంగుల కేంద్రంలో హాలిడే పార్టీ జరుగుతున్న సమయంలో సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు ఆగంతకులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఆగంతకుడు మరణించినట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తుల వద్ద భారీగా ఆయుధాలు వున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన మీద అమెరికా అధ్యక్షుడు స్పందించారు. దుండగులు అందరూ హతమయ్యే వరకూ ఆపరేషన్ కొనసాగించాలని ఆయన భద్రతా దళాలను ఆదేశించారు.