ఇంట్లోకి దూసుకెళ్ళిన అంబులెన్స్

 

అంబులెన్స్ ఇంట్లోకి దూసుకెళ్ళడంతో ఇద్దరు మరణించారు. బీహార్‌లోని భాగల్పూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం తెల్లవారుఝామున ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. దాంతో మట్టితో కట్టిన ఆ ఇల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న జునియాదేవి (22), మాంఝీ (5) అక్కడిక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్ పరారీలో వున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu