TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిసెంబర్ 31 లోగా జిల్లాల పేర్లు, సరిహద్దులు ప్రకటన

Published on: Wed Aug 13, 2025 3:58PM

 

అమరావతి  సచివాలయంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఇవాళ తొలిసారిగా సమావేశం నిర్వహించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది నివేదిక ఇవ్వాలని మంత్రుల భేటిలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి మంత్రుల బృందం వినతులు స్వీకరించనున్నారు. ఈలోపు కూడా ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్ కు పంపించవచ్చుని వారు తెలిపారు. 

సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్వీభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల  మార్పులు ప్రక్రియ ముగిస్తామని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు  కోసం కసరత్తు చేస్తామని వారు పేర్కొన్నారు. 

రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల  బృందం పని చేస్తుందని వెల్లడించారు. నియోజకవర్గాల జోలికి వెళ్లబోమన్న మంత్రి అనగాని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని...అయితే పరిపాలనా సౌలభ్యమే గీటురాయి అన్న  మంత్రి అనగాని తెలిపారు.ఈ సమావేశానికి  మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గోన్నారు.