TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజధాని నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ

Published on: Tue Jun 24, 2025 10:08PM

 

రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయం అందించారు. సచివాలయంలో  మంగళవారం సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మీ 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. 

నాలుగు బంగారు గాజులతో పాటు మరో రూ.1 లక్ష చెక్కును విరాళంగా అందించారు. రాజధాని నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలు రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు. వీరి ఔదార్యం, ఉదారత ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.