TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి శంకుస్థాపనకు వామపక్ష నేతలు

Published on: Wed Oct 21, 2015 3:50PM

 

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉండాలని డిసైడైతే... వామపక్షాలు మాత్రం హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నాయి, కేపిటల్ పౌండేషన్ కు పేదలు, కూలీలను పిలవకపోవడం, మరోవైపు భూసేకరణ వివాదం ఇలా అనేక అభ్యంతరాలున్నా శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రం హాజరుకావాలనుకుంటున్నామని సీపీఐ నేతలు ప్రకటించారు, సీపీఎం నేతలు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇరుపార్టీల నేతలు మీడియా ప్రకటన విడుదల చేశారు.