Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇదీ అల్లు అర్జున్ మిత్రుడి నిర్వాకం!
posted on: May 15, 2024 11:13AM
సరిగ్గా ఎన్నికల వేళ ఐకాన్ స్టార్, మెగా హీరోలలో ఒకడు అయిన అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాను నంద్యాల వెళ్లి మిత్రుడికి మద్దతు తెలపడాన్ని అల్లు అర్జున్ సమర్ధించుకున్నాడు. తనకు పార్టీలతో సంబంధం లేదనీ, మిత్రుడి కోసం మాత్రమే నంద్యాల వచ్చాననీ, ఆయనకు మద్దతు ప్రకటించాననీ చెప్పుకున్నారు.
అంతే కాకుండా తాను నంద్యాల వెళ్లడానికి ముందే పిఠాపురం నుంచి పోటీలో ఉన్న జనసేనానికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశానని చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ సరిగ్గా పోలింగ్ కు ముందు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీ చేయడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నాగబూబు కూడా సీరియస్ గా స్పందించారు. మాతో ఉంటూ మా ప్రత్యర్థుల కోసం పని చేస్తూ వెన్ను పోటు పొడిచే వారిని పరాయివారిగానే భావిస్తామని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని అంతా భావిస్తున్నారు.
కాగా ఇప్పుడు అల్లు అర్జున్ మిత్రుడి నిర్వాకం ఇదీ అంటూ మెగాభిమానులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి చెందిన పాత వీడియోలను సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సరిగ్గా ఎన్నికల వేళ పనిగట్టుకుని మరీ నంద్యాల వెళ్లి మద్దతు తెలిపిన మిత్రుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గతంలో పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలూ, అలాగే ప్రజారాజ్యం సమయంలో చిరంజీవిపై చేసిన విమర్శల వీడియోలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ చేసిన ద్రోహం ఇదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.


.webp)



