అంతర్వేదిలో బన్నీ సినిమా స్క్రిప్టు

Publish Date:Feb 23, 2015

 

అల్లు అర్జున్‌తో తన కొత్త సినిమాని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నానని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన సోమవారం సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛాటనతో ఆయనకు ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ, అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్ పతాకంపై తాను చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టును అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత వుంచి పూజ చేసినట్టు బోయపాటి శ్రీను తెలిపారు.

By
en-us Political News