మళ్ళీ 'అల్లరి' చేయనున్న నరేష్, ర‌విబాబు

 

 

 Allari Naresh combo again,naresh ravi babu, naresh allari movie, allari ravi babu

 

 

అల్లరి సినిమా నరేష్, రవి బాబు కేరియార్స్ ను మార్చేసింది. 2002లో వచ్చిన ఈ సినిమా తో నరేష్ టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ఈ చిత్రం విడుదలై సంచ‌ల‌నం సృష్టించింది.. ఈ సినిమాయే న‌రేష్ ఇంటిపేరుగా మారిపోయింది. ర‌విబాబు చేసిన ప్రయ‌త్నం మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అల్లరి త‌ర్వాత న‌రేష్ అండ్ ర‌విబాబు 2006లో పార్టీ సినిమాతో మ‌రోసారి జోడీ క‌ట్టారు. మ‌ళ్లీ ఏడేళ్ల త‌ర్వాత న‌రేష్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు ర‌విబాబు.


ర‌విబాబు నుంచి పూర్తి స్థాయి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ వ‌చ్చి చాలాకాల‌మే అయింది.. ఆ మ‌ధ్య న‌చ్చావులే త‌ర్వాత మ‌ళ్లీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ తీయ‌లేదు ర‌విబాబు.. ఇప్పుడు న‌రేష్ తో క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ థ్రిల్లర్ కు స్టోరీ రెడీ చేసుకుంటున్నాడు. మ‌రి మూడోసారి జోడీ క‌డుతున్న న‌రేష్, ర‌విబాబు ఆడియ‌న్స్ ను ఏ రేంజ్ లో కిత‌కిత‌లు పెడ‌తారో చూడాలి..!

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu