Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబుకు ఇంటి స్థలం నేనిస్తా: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే
posted on: Jul 7, 2019 4:15PM

ఉండవల్లి కరకట్టపై ఉన్న అక్రమనిర్మాణాలను కూల్చి వేయాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రజా వేదికను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కరకట్టపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను తొలగించాలని సీఆర్డీఏ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. కాగా, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తాజాగా ఈ విషయంపై స్పందించారు. ఈ గెస్ట్ హౌస్ నుంచి చంద్రబాబు వెంటనే బయటకు రావాలని, లేదంటే సీఆర్డీఏ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసారు. చంద్రబాబు ఐదేళ్లుగా దోచిన సంపదను ఆ ఇంట్లోనే ఏమన్నా దాచిపెట్టారా? అని అనుమానం వ్యక్తం చేసారు. ఈ ఇంటిని చంద్రబాబుకు బలవంతంగా లింగమనేని ఇస్తే, ఆ విషయాన్ని ఆయన చెప్పాలని వ్యాఖ్యానించారు. అక్రమనిర్మాణాలు ఉంటే ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆర్కే స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఇల్లు కొనుక్కొనే స్తోమత లేకపోతే, ఇంటి నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని తాను ఇస్తానంటూ ఆర్కే సెటైర్లు విసిరారు.






