Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అక్కినేని నాగేశ్వర రావు ఆకస్మిక మృతి
posted on: Jan 22, 2014 7:25AM
.jpg)
ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వర రావు నిన్న రాత్రి నిద్రలోనే చనిపోయారు. రెండు నెలల క్రితం ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, కానీ అందుకు తాను ఎంత మాత్రం బయపడటం లేదని, పైగా ఈ వయసులో మరో పరీక్షలో నెగ్గేందుకు భగవంతుడు తనకొక మరొక గొప్ప అవకాశం ఇచ్చాడని తనదయిన శైలిలో వివరించారు. జీవితంలో అనేక పరీక్షలు దైర్యంగా ఎదుర్కొని గెలిచిన తాను, భగవంతుని, అభిమానుల ఆశీర్వాదంతో ఈ పరీక్షలో కూడా నెగ్గి నిండు నూరేళ్ళు బ్రతుకుతానని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఆయన ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదంటే ఈ విషయం తెలిసిన తరువాత కూడా తన కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యలతో కలిసి ‘మనం’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.
నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, నిన్న సాయంత్రం ఆయన మా అందరితో కులాసాగా కబుర్లు చెప్పారు. రాత్రి నిద్రలోనే ఆయన ప్రశాంతంగా పోయారు. ఆయన అభిమానుల సందర్శనార్ధం ఆయన దేహాన్నిఈరోజు అన్నపూర్ణా స్టూడియోలో ఉంచుతాము,” అని తెలిపారు.


.jpg)
.jpg)


