ఒక్క రోజులో 3 లక్షలు

Publish Date:Apr 11, 2015

 

అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమా సంగతేమో కాని తన ఫస్ట్ లుక్ టీజర్ మాత్రం బాగానే హిట్ అయ్యింది. ఈ టీజర్ కు ఒక్క రోజులో 3 లక్షల హిట్స్ రావడం విశేషం. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. 8న ఉదయం 11 గంటల నుండి 9న ఉదయం 11 గంటల వరకు అంటే 24 గంటల్లో 3 లక్షలు రావడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత, హీరో నితిన్ అన్నారు. అక్కినేని అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున తన ట్విట్టర్ అఖిల్ నటించే సినిమా ఫస్ట్ లుక్ టీజర్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ అయితే హిట్టయ్యింది... మరి సినిమా కూడా అదే రేంజ్ లో హిట్టవుతుందో లేదో చూద్దాం.

By
en-us Political News