TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామ్ చరణ్ తో సీఎం అఖిలేష్ యాదవ్

Published on: Mon Jul 22, 2013 10:30AM

 

Akhilesh Yadav meets Ram Charan, Ram Charan Akhilesh Yadav

 

 

హైదరాబాదులో జరుగుతున్న యాదవ సభకు హాజరైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇక్కడ రాష్ట్ర ప్రముఖ నేతలను సుడిగాలిలా పర్యటిస్తూ కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును, కేంద్ర మంత్రి చిరంజీవిని.. బొత్స సత్యనారాయణను ఇలా అందరినీ ఆయన వరుసబెట్టి కలిశారు. అనంతరం ఆయన పలు చోట్ల మాట్లాడారు. చిరంజీవి గురించి మాట్లాడుతూ “తాను మైసూరులో చదువుతున్న రోజుల్లో చిరంజీవి సినిమాలు బాగా చూసేవాడినని” చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చిరంజీవి చొరవ తీసుకుంటున్నారని అన్నారు. అంతేకాదు, ”చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యాక పర్యాటక శాఖకు గ్లామర్ చేకూరిందని” అఖిలేష్ సరదా వ్యాఖ్య చేశారు.

 

ఇక గ్లామర్ ఫీల్డులో పొగడ్తలు, చప్పట్ల మధ్య ఎదిగిన చిరంజీవి ఊరికే ఉంటారా.. అఖిలేష్ యాదవ్ యువతకు స్పూర్తి అన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువకులకు ఒక ప్రేరణగా నిలిచారన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక అభివృద్ధి నువ్వు బాగా చేస్తున్నావంటే, నువ్వు బాగా చేస్తున్నావంటూ ఇద్దరూ పొగుడుకున్నారు.