రాజ్యసభకు అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్!?
posted on: Jan 31, 2026 9:08AM

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన మరణం తరువాత ఎన్సీపీ తమ పార్టీ నేతగా అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ను ఎన్నుకోవడానికి నిర్ణయించుకున్నారు.
అంతే కాకుండా అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీకి దింపాలని డిసైడ్ అయ్యారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ను ఫడ్నవీస్ తన కేబినెట్ లోకి తీసుకోనున్నారు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్ ఆరు నెలలలోగా రాజీనామా చేసి బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఆమె స్థానంలో అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్డ్ పవార్ మావల్ నియోజకవర్గం గతంలో లోక్ సభకు పోటీ చేసి పరాజయం పాలయ్యారు.




.webp)





